అధిక వేగంతో ప్రయాణాలు వద్దు అని, ఎన్ని విధాలుగా ప్రజలకు హెచ్చరించినా సరే కొంత మందిలో మార్పు మాత్రం ఏ విధంగా కూడా వచ్చే అవకాశాలు ఉండవు. దీంతో అధిక వేగంతో వెళ్లే ఎంతో మంది మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
అధిక వేగంతో వెళ్లే వారి విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే, ఎన్ని విధాలుగా అవగాహన చర్యలు చేపడుతున్నా సరే ప్రజల్లో మాత్రం మార్పు అనేది కనబడటం లేదు. తాజాగా ఎన్.సి.ఆర్ బీ ఒక డేటా విడుదల చేసింది. 2019 లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో 1.54 లక్షల మంది మరణించారు. అధిక వేగంతో 59.6% ప్రమాదాలు జరిగాయి. ఈ తాజా లెక్కలు చూసి అయినా సరే కొంత మందిలో మార్పు వస్తుందేమో ఆశిద్దాం. ప్రధానంగా యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.