హోమ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదు. ఇంట్లో వుండే వస్తువులు దొంగతనానికి గురికావడం వల్ల ఇంట్లో వస్తువులు పోవడం జరిగినా లబ్ధి పొందవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి హోమ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు ఏదైనా హోమ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవడానికి వీటిపై దృష్టి పెట్టండి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవడానికి మొదట అవసరాన్ని గుర్తించాలి. ఇంట్లో ఉండే ఇతర విలువైన వస్తువుల కోసం యాడ్ ఆన్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటితో పాటు వస్తువులన్నింటికీ కలిపి ఇన్సూరెన్స్ హామీ ఇచ్చే ప్యాకేజీ పాలసీలు కూడా ఉంటాయి. అలానే ఇంట్లో ఉంచే వస్తువులతో పాటు, బయట దాచుకునే వాటికీ ప్రత్యేకంగా యాడ్ ఆన్ పాలసీలు తీసుకోవచ్చు.
అలానే ఇలాంటి పాలసీలు అదనపు బారంగా మారకుండా ఉండాలంటే, క్లెయిమ్ తీసుకునేటప్పుడే ప్రీమియం గురించి ఆలోచించాలి. ఇది ఇలా ఉంటే మార్కెట్ విలువ ఆధారంగా బీమా చేసే మొత్తాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా హోమ్ ఇన్సూరెన్స్ సమ్ అస్యూర్డ్ వ్యాల్యూ అనేది, ఊహించని ప్రమాదాల వల్ల ఏర్పడే నష్టాలను పూడ్చుకునేలా ఉండాలి. అలానే పాలసీలని తీసుకునేటప్పుడు డిస్కౌంట్లు చూడాలి. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. అదే విధంగా హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా రీ-ఎవాల్యుయేషన్ చేయాలి.