ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఏ ట్రోపీ అయినా ఈ రెండు జట్లు తలపడితే క్రేజ్ ఎలా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తొలి మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ విజయం సాధించింది. కానీ ఆతిథ్య పాక్ మాత్రం న్యూజిలాండ్ పై ఓటమి చెందింది. ఇవాళ నువ్వా..? నేనా అనే విధంగా సాగే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది.
భారత జట్టు :
రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కే.ఎల్. రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.
పాకిస్తాన్ జట్టు :
రిజ్వాన్, సౌద్ షకిల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుస్దిల్ షా, షాహిన్ అప్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.