దేశ వ్యాప్తంగా నీట్ యూజీ-2024 పేపర్ లీకేజ్ ప్రకంపనలు రేపుతన్న వేళ…. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తాజాగా డీఎంకే ఎంపీ కనిమొళి కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షా విధానం నుంచి తమిళనాడును మినహాయించాలని ఆ రాష్ట్రానికి చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.నీట్ పరీక్షా విధానం లోపాలున్నాయి అని అన్నారు.ఇటీవల నీట్ పరీక్ష నిర్వహణలో ఇది బయటపడింది.. మాకు నీట్ పరీక్షా విధానం వద్దని తమిళనాడు ఎప్పటినుంచో చెబుతోంది అని గుర్తు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా అదే చెబుతోంది అని సోమవారం (జూన్ 24) ఢిల్లీలో జరిగిన ఎన్ ఎస్ యూఐ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు.
కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు.నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది.