తిరుపతి బై పోల్స్‌లో నిర్లక్ష్యం.. ఆ పోలీస్ అధికారుల‌పై వేటు!

-

తిరుపతి ఎంపీ ఉపఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. డీజీపీ ద్వారక తిరుమల రావు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేటు పడిన వారిలో తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఆయన్ను వీఆర్‌కు పంపి ఆయ‌న స్థానంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

అయితే, సీఐ మహేశ్వర్‌రెడ్డి మంగళవారం రాత్రి నుంచి ఫోన్ ఆఫ్ ‌ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన బెంగుళూరులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నటి,మోడల్ కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన కేసులో ఈయనకు ప్రమేయం ఉన్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తిరుపతి బై పోల్ సందర్భంగా చెలరేగిన హింసకు బాధ్యులను చేస్తూ ఐదుగురు పోలీసు అధికారులపై డీజీపీ వేటు వేయడం రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version