ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్రంలో ఓవైపు పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో పోస్టల్ అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది.
హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు తరలించే క్రమంలో ఆన్సర్ షీట్స్ బండిల్స్ చిరిగిపోయి దర్శనమిచ్చింది. పార్సిల్ చేసిన బండిల్స్ బస్తా చిరిగిపోవడంతో జవాబు పత్రాలు బయటపడి నలిగిపోయాయి. జవాబు పత్రాలకు డ్యామేజ్ అయితే మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని విద్యాశాఖ నిపుణులు చెబుతున్నారు.