అతన్ని గెలిపించండి.. రామ్ చరణ్ హీరోయిన్ ఎన్నికల ప్రచారం..!

-

రాజకీయ నేతలు తరపు పార్టీ తరఫున హీరో హీరోయిన్లు అలానే కొంతమంది ప్రముఖ నటులు ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. తాజాగా రామ్ చరణ్ సరసన ఆడిపాడిన నేహా శర్మ ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నారు. తండ్రి అజిత్ శర్మ బీహార్ లోని బాగల్ పూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. అయితే ఈ క్రమం లో ఆమె బీహార్ లో రోడ్డు షో ని నిర్వహించారు.

ప్రస్తుతం ఈ రోడ్ షో కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి మీరు నా పట్ల చూపిన ప్రేమ ఆదరణ నా గుండెని నింపేసింది అని నేహా శర్మ అన్నారు. ప్రస్తుతం ఈ రోడ్ షో ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు గతంలో ఈమె కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news