ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ విభిన్న ప్రతిభావంతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. జీవో నంబర్ 2ను సవరించి రోస్టర్ పాయింట్ 6 ని జనరల్ చేయాలని, దీనివల్ల అంధ పురుష అభ్యర్థులకు మేలు జరుగుతుందని తెలియజేశారు. పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఉన్నవారు వ్యక్తిగత విషయాలను, రేషన్ కార్డుల అంశాలు గురించిన విషయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

చాలా ఓపికగా దివ్యాంగుల సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ తొందరలోనే ఆ సమస్యలను పరిష్కరించి తీరుతామని స్పష్టం చేశారు. దివ్యాంగుల సమస్యల గురించి క్యాబినెట్లో చర్చించిన అనంతరం వారి సమస్యలను, కోరికలను నెరవేర్చి తీరుతామని పవన్ కళ్యాణ్ దివ్యాంగులకు హామీ ఇచ్చారు. కాగా నేటితో సేనతో సేనాని కార్యక్రమం పూర్తి కానుంది. ఈ సమావేశాలు ప్రారంభమై నేటికీ మూడవరోజు కావస్తుంది. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సమావేశాలకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీని మరింత అభివృద్ధి చేసే దిశగా జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సంప్రదింపులు జరిపారు.