అసెంబ్లీ ఎన్నికలు 2024: నెల్లూరు రురల్ లో కోటంరెడ్డిని వైసీపీ జయిస్తుందా ?

-

వైసీపీ మరియు టీడీపీ ల మధ్యన చాలా నియోజకవర్గాలలో టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనాలు. అందులో నెల్లూరు రురల్ నియోజకవర్గం కూడా ఒకటని చెప్పాలి. గత ఎన్నికల్లో నెల్లూరు రురల్ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ పై గెలిచాడు. కానీ గత కొంతకాలం క్రిందట కోటంరెడ్డి వైసీపీకి బై బై చెప్పి టీడీపీ లోకి చేరాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలుస్తున్నాడు. అందుకోసం ఇప్పటి నుండే క్యాంపెనింగ్ భారీ లెవెల్ లో స్టార్ట్ చేశాడు. అయితే వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నిలబెడుతున్నారు. కానీ సర్వే లు మరియు కొందరు రాజకీయ సీనియర్ నాయకుల అభిప్రాయం ప్రకారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీ కొట్టి వైసీపీ రురల్ లో గెలవడం దాదాపు అసాధ్యం అంటూ చెబుతున్నారు.

ఎందుకంటే ప్రజల కోసం ఈసమస్యను అయినా పరిష్కరించడానికి ఎంతదూరం అయినా వెళ్ళడానికి కోటంరెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ తెగింపే నెల్లూరు రురల్ ప్రజల ఆశీర్వాదానికి కారణం అని చెబుతున్నారు. కానీ ఎన్నికలలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version