నెల్లూరు జిల్లా వార్షిక నేర నివేదికను విడుదల చేసారు SP కృష్ణ కాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై నేరాలు 13.5 శాతం తగ్గాయి. వరకట్న మరణాల కేసులు నమోదు కాలేదు. గత ఏడాదితో పోలిస్తే హాత్యాయత్నం… చీటింగ్.. రేప్.. రోడ్డు ప్రమాదాలు.. దోపిడీ కేసులు తగ్గాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన 11 కేసులలో నిందితులకు కఠిన శిక్షలు.. జరిమానాలు విధించేలా చేసాం. మొబైల్ మిస్సింగ్ ఫిర్యాదులకు సంబంధించి ఏడు విడతలలో రూ.8 కోట్ల విలువైన మూడువేల సెల్ ఫోన్లను రికవరీ చేసాం.
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేశాం. ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి 34 వేల 780 కేసులలో కోటి 80.లక్షల 43 వేల రూపాయల జరిమానా విధించాం. 6 వేల 344 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాం. కొత్త సంవత్సరంలో నేరాలు నియంత్రణకు మరింత కృషి చేస్తాం. ఆధునిక టెక్నాలజీని మరింతగా వినియోగిస్తాం. నూతన సంవత్సర వేడుకలను నిబంధనల మేరకే నిర్వహించాలి. అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రులు.. హాస్టళ్లు.. నివాస ప్రాంతాల్లో బాణా సంచా కాల్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు. రోడ్లపై బహిరంగంగా కేక్ కట్ చేయడం.. ప్రయాణీకులకు.. వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తే సహించం.. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం అని నెల్లూరు SP పేర్కొన్నారు.