అవును, మీరు చదివింది నిజమే! బ్యాంకుల కంటే సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లే ఎక్కువ. అదేంటో తెలుసుకుందాం. ఆర్థిక సేవలను అందించే నియో సంస్థ ఏకంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపైనే 7శాతం వడ్డీని అందిస్తామని ప్రకటించింది. NEO X యాప్ ద్వారా కస్టమర్లు ఈ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. కరోనా నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేశాయ్. ఎఫ్‌డీ వడ్డీరేట్లు సైతం 6 శాతానికి తక్కువే ఉంది. కానీ, నియో సంస్థ ఏకంగా సేవింగ్స్ డిపాజిట్ల పైన 7 శాతం వడ్డీని అందిస్తోంది.
ఈ సదుపాయాన్ని మీరూ పొందాలనుకుంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీసా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ సేవింగ్స్ అకౌంట్‌పై వచ్చే వడ్డీ రేటు ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల కంటే తక్కువ కావడం విశేషం. NEO సేవింగ్స్ అకౌంట్లో లక్ష వరకు ఉండే డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీని పొందవచ్చు. రూ.1 లక్షకు పైగా చేసే డిపాజిట్లపై నియో సంస్థ 7 శాతం వడ్డీని అందిస్తోంది. 5–10 ఏళ్లకు చేసే ఎఫ్‌డీలపై స్టేట్‌బ్యాంక్ 5.4 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6.2 శాతం వర్తిస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1లక్ష వరకు చేసే డిపాజిట్లపై కేవలం 2.7 శాతం మాత్రమే.
యువత ఆలోచనలకు అనుగుణంగా తమ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీసా భాగస్వామ్యంతో తమ సేవలను విస్తరిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 20 లక్షల మంది వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తమ ఈ కొత్త సేవలను ప్రారంభించే ముందు మిలీనియల్స్‌పై సర్వే చేశారు. మన దేశంలోని 70 శాతం మంది యువత డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో తేలింది. రివార్డులు, ఆఫర్ల కోసం బ్యాంకులను తరచుగా మారుస్తున్నామని 55 శాతం మంది,మెరుగైన వడ్డీ రేట్ల కోసం బ్యాంకులను మారుస్తామని 45 శాతం మంది చెప్పారు.
నియోఎక్స్ ఉపయోగాలు
ఈ సంస్థ ఆన్ లైన్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే నియో ఎక్స్‌లోఖాతా ఓపెన్ చేయవచ్చు. మీ ఖాతాకు ఎటువంటి మెయింటెనెన్స్ రుసుము వర్తించదు. వర్చువల్ డెబిట్ కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ తరువాత ఫిజికల్ డెబిట్ కార్డును ఆర్డర్ చేయవచ్చు. జూన్ వరకు ఈ కార్డులను ఉచితంగానే అందించనున్నారు. ఈ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో చేసే పెట్టుబడులపై ఎటువంటి కమీషన్ వర్తించదు. తమ పోర్ట్‌ఫోలియోను వినియోగదారులు నియో యాప్‌లో చూసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ ఫర్ చేసుకునేవారికి ఈక్వి ట్యాక్స్ లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. వీటిని డిస్కౌంట్ కూపన్లుగా వాడుకోవచ్చు.