ఆ దేశాల్లో ఇలా చేస్తే జరిమానా తప్పదు..!

-

మన దేశంలో నిత్యం చూసే చిన్న చిన్న సంఘటనలకు కూడా వేరే దేశాల్లో కఠిన నిబంధనలు విధిస్తారు. ఈ స్మార్ట్ యుగంలో ప్రతిఒక్కరి చేతి స్మార్ట్ ఫోన్లు తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్లకు బానిసయ్యారు. సమయం.. సందర్భం లేని చోట కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని కనిపిస్తుంటారు. ఇప్పటికే మనం రోడ్లపై చూస్తునే ఉంటాం. చాలా మంది రోడ్లు దాటుతున్నప్పుడు కూడా ఫోన్లు చూసుకుంటూ వెళ్లడం, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుంది. అయితే చైనాలో ఇలా రోడ్డు దాటేటప్పుడు ఫోన్ వాడితే వారిపై జరిమానా విధిస్తారు. 52 చైనీస్ యెన్ (రూ.584) చలానా విధిస్తారు పోలీసులు. ఇలాంటి జరిమానా విధింపులు కేవలం చైనానే కాదు.. కొన్ని దేశాల్లోనూ నేరంగా పరిగణిస్తారు.

laws-car

కారు విండోస్ తెరిచి ఉంచితే..
కారులో ఉన్న వస్తువులు ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్తారనే భయం అందరిలో ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తతో కారు విండోస్ అన్ని క్లోజ్ చేసేస్తాం. ఇలాంటి వాటికి ప్రత్యేకంగా చట్టాలు కూడా లేవు. కానీ కెనడా, ఆస్ట్రేలియా దేశంలో కారు పార్క్ చేస్తే విండోస్ కచ్చితంగా మూసివేయాలనే చట్టం ఉంది. ఎవరైనా విండోస్ మూసివేయకుంటే 81 డాలర్ల జరిమానా విధిస్తారు.

ఇంధనం తక్కువుంటే..
జర్మనీలోని అటోబాన్ రహదారి ఎంతో అత్యాధుని టెక్నాలజీతో అక్కడి ప్రభుత్వం రూపొందించింది. రోజూ ఈ రోడ్డుపై వాహనాలు కనీసం గంటకు వంద కిలోమీటర్ వేగంతో వెళ్తుంటాయి. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్డుపై తక్కువ ఇంధనంతో వెళ్తే పోలీసులు జరిమానా విధిస్తారు. ఎందుకంటే తక్కువ ఇంధనంతో ప్రయాణిస్తే వాహనాలు రోడ్డుపై ఆగిపోతాయి. దీంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడతారు. అందుకే పోలీసులు ముందుగానే వాహనంలో ఇంధనం ఉండేలా చెక్ చేసుకుంటారు. ఒక వేళ ఇంధనం తక్కువగా ఉంటే 70 పౌండ్ల వరకు జరిమానా విధిస్తారు.

ఈ బీచ్‌లో రుమాలు వేయొద్దు..
కొందరు బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు అక్కడ రుమారు గానీ, బ్యాగులు గానీ వేస్తుంటారు. అలా చేస్తే ఆ స్థానాన్ని రిజర్వ్ చేసుకున్నట్లు అర్థం. అయితే ఇటలీలోని టుస్కానీ నుంచి సార్డానియా వరకున్న బీచులో పర్యాటకులు రుమాలు వేసి రిజర్వ్ చేసుకోరాదు. అలా చేస్తే 200 పౌండ్ల వరకు జరిమానా విధిస్తారు.

5 కేజీల బంగాళదుంప తీసుకెళ్లొద్దు..
ఆస్ట్రేలియాలో ఒకేసారి ఒక వ్యక్తి 5 కేజీల బంగాళదుంపను తీసుకెళ్లడానికి వీలు లేదు. ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధం సమయంలో అప్పటి ప్రభుత్వం ఆహార పదార్థాల రవాణాపై నిబంధనలు అమలు చేసింది. అవీ ఇప్పటికీ అమలు అవుతూనే ఉన్నాయి. యుద్ధం సమయంలో ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా కారులో 5 కేజీలకు మించి బంగాళదుంపను తీసుకెళ్లినట్లయితే 2వేల ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version