గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. ఎంపీ పరిస్థితి విషమం.. తల్లి మృతి

-

ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నేపాల్ ఎంపీ చంద్ర భండారి ఇంట విషాదం నెలకొంది. బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో  ఎంపీతో సహా ఆయన తల్లి తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడటంతో  ఎంపీ తల్లి కన్నుమూశారు. చంద్ర భండారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..బుధవారం అర్ధరాత్రి.. ఎంపీ ఇంట్లో గ్యాస్​ సిలిండర్ పేలింది. ఎంపీ శరీరం 25 శాతం కాలిపోగా.. ఆయన తల్లి శరీరం 80 శాతం కాలిపోయింది. వెంటనే ఎంపీతో సహా ఆయన తల్లిని చికిత్స నిమిత్తం కీర్తిపుర్​ ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటం వల్ల వారిని ప్రత్యేక హాస్పిటల్​కు తరలించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ముంబయి ప్రత్యేక ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఈలోపలే ఎంపీ తల్లి చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news