నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరుతో ఎర్ర కోట వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రధాని మోడీ బుధవారం ప్రారంభించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన 1857 నాటి మొట్టమొదటి స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన చిత్రాలను ప్రధాని తిలకించారు. నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. నేతాజీ వాడిన చెక్క కుర్చీ, ఆయన సాధించిన మెడల్స్, బ్యాడ్జిలు, యూనిఫాం, ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)కి సంబంధించిన వస్తువులను ఇందులో పొందుపరిచారు.
ఈ సందర్భంగా నేతాజీకి శ్రద్ధాంజలి ఘటించారు. యాద్-ఇ-జలియన్ మ్యూజియాన్ని సైతం సందర్శించారు. మ్యూజియంలో ఆయన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన, వాస్తవిక విషయాలను పొందుపరిచారు. దేశ వ్యాప్తంగా నేతాజి జయంతి ఉత్సవాలను వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహిస్తున్నారు.