అవతార్ మీద కామెంట్స్ చేసి నెటిజన్స్ తో తిట్లు తిన్న నిర్మాత..!!

-

తెలుగులో ఒక మంచి సామెత ఉంది అదే గురివింద గింజ నీతి. గురివింద తన కింద ఉన్న నలుపు చూడకుండా వేరే వారిని నల్లగా ఉన్నావు అంటూ ఉంటుంది. ఇక దీనిలో ఎక్కువ మందిని గాట్టిగా తగిలే పాయింట్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనుషులు తాము ఏమి చేస్తున్నారో వదిలి వేరే వారు తప్పు చేస్తున్నారని అంటూ పెద్ద మాటలు చెబుతూ ఉంటారు.

ఇక ఈ మొబైల్ యుగంలో ఎవరు ఏమి చేసినా అందరికీ తెలిసిపోతుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది నిర్మాత నాగవంశీకి. ఈయన గారు తాజాగా అవతార్ సినిమా చూసి సినిమా మీద , గ్రాఫిక్స్ మీద కామెంట్స్ చేస్తూ సినిమాలో ఏమి లేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ట్విస్ట్ జరిగింది. ఆయన నిర్మిస్తున్న బుట్టబొమ్మ చిత్రం జనవరి 26న రిలీజ్‌ కానుందంటూ అధికారికంగా ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

అక్కడే నిర్మాత నెటిజన్స్ కు దొరికి పోయాడు. అసలే కరోనా వల్ల ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు చూస్తున్న నెటిజన్స్ కు నిర్మాత కరెక్ట్ గా దొరికి పోయాడు . ఈ సినిమా పోస్టర్  క్రిస్టోఫర్‌ నోలన్‌ ‘ద ప్రెస్టేజ్‌’ అనే సినిమా ను చూసి ముద్ర కొట్టినట్లు అచ్చంగా దింపేసారు. ఇది చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో తగులుకున్నారు. అవతార్‌ 2నే అవమానించావు, మరి నువ్వు చేసిందేంటి? ఏకంగా హాలీవుడ్‌ సినిమా పోస్టర్‌నే డిట్టో కాపీ కొట్టావు అని కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. అట్లుంటది నెటిజన్స్ తోటి..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version