మెట్రోలో యువతి డ్యాన్స్.. నెట్టింట భిన్నాభిప్రాయాలు

-

ఇటీవలే హైదరాబాద్ మెట్రోలో ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్​చల్ సృష్టించింది. ఆ వీడియో మెట్రో యాజమాన్యం దృష్టికి వెళ్లగా మెట్రో ఎండీ యువతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెట్రో రైళ్లో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఎలాంటి పనులైనా అనుమతించబోమని.. ఈ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్​ పోలీసులు కూడా ఆమెకు నోటీసులు ఇచ్చారు.

ఇదంతా ఓవైపు.. మరోవైపు ఏం జరుగుతోందంటే.. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 50వేలకు పైగా మంది ఈ వీడియోను వీక్షించారు. ఇక లైకులు, షేర్​లకు లెక్కలేదు. పబ్లిక్ ప్లేస్​లలో డ్యాన్స్​లు చేయడం.. వీడియోలు తీయడం.. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వెరైటీగా ఉన్నవి ట్రెండ్ అవ్వడం ఈరోజుల్లో ఇదంతా మామూలే. కానీ స్పెషల్​గా మెట్రోలో యువతి డ్యాన్స్ చేయడం.. ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం ఇంకాస్త ట్రెండ్ అవుతోంది.

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరేమో “మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అని.. అలాంటి ప్లేస్​లలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి ఇతరులకు ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు” అంటున్నారు. మరికొందరేమో.. “ఆమె ప్రయాణిస్తున్న మెట్రోలో జనం ఎక్కువగా లేరు. ఆమె ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా తన ట్యాలెంట్​ను షో చేసింది. అంతే కాకుండా నాకు తెలిసి.. మెట్రోలో ప్రయాణిస్తున్న వారు ఆమె డ్యాన్స్ చూసి ఎంటర్​టైన్ అయ్యుంటారు. సో ఇందులో ఆమె తప్పేం లేదు.” అని చెబుతున్నారు. ఇంకొందరేమో “ఆమె డ్యాన్స్ వీడియోతో మెట్రోకు పాపులారీటీ వచ్చిందని.. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పాలని” అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version