ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా కనిపించని శత్రువుతో పోరాడుతుంటే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరమైన కరోనా వైరస్ అనే మహమ్మారిని ఎదుర్కొనటానికి అన్ని రంగాలలో టాప్ స్థానాలలో ఉన్న దేశాలే భయపడి ప్రజలను ఇంటి నుండి బయటకు రావొద్దు అన్నారు. ఇటువంటి టైములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జనసేన పార్టీ నాయకుడు నాగబాబు ఇటీవల ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా అర్థం పర్థం లేని విమర్శలు చేసుకున్నారు. ముందుగా వైసిపి పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ట్విటర్లో పవన్ కళ్యాణ్ బిల్డప్ ఇస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను తాను చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ కలరింగ్ ఇస్తున్నట్లు అంబటి రాంబాబు విమర్శించారు.
ప్రపంచమంతా కరోనా వైరస్ తో మనుషులు చనిపోతుంటే మీ రాజకీయాలు ఇంకా ఆపరా అంటూ తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మనుషులు ప్రాణాలు కోల్పోతున్న టైంలో కూడా రాజకీయ నాయకులు అయి ఉండి ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అంటూ ప్రశ్నించారు. అసలు ఆ కామెంట్లు ఏంటి?, ప్రస్తుతం బయట ప్రజలు పడుతున్న బాధ ఏంటి?. దేనికైనా సంబంధం ఉందా అంటూ చాలామంది ప్రశ్నించారు. ‘ మాటల ‘ తూటాలు పక్కనెట్టి .. చైతన్యం వైపు అడుగులేయండి .., ప్రజలు ప్రభుత్వాలకు సహకరించేలా మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ ఇద్దరికీ నెటిజన్లు బాగా క్లాస్ తీసుకున్నారు.