మర్కజ్ మసీదు ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లిన వారివే కావటంతో అధికార నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న స్టార్టింగ్ టైములో ఎక్కువగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వారి వల్ల వ్యాప్తి చెందుతుందని గుర్తించడం జరిగింది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వాళ్లని ఇంటికే పరిమితం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకంటే ముందు జగన్ ప్రభుత్వం ఉంది.
ఎందుకంటే ఓట్ల సమయంలో మినహా మిగిలిన సమయాల్లో రాజకీయ నేతలు తమ గడప తొక్కరనే అభిప్రాయంలో జనం ఉన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉండే ఈ వ్యవస్థలో పేర్నినాని వాళ్లకు భిన్నంగా వ్యవహరించడంతో మచిలీపట్నం వాసులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ పార్టీలో హాట్ టాపిక్ అవటంతో… ఇటువంటి టైములో అన్నా నువ్వు నియోజకవర్గం ప్రజలపట్ల మంచిగా ప్రతిస్పందించారు అంటూ సహచరులు అభినందించారు. ఇదే టైమ్ లో మంచి బిజీగా ఉన్న జగన్ కూడా పేర్ని నాని కి ఫోన్ చేసి ‘అన్నా నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అంటూ అభినందించినట్లు వైసీపీ పార్టీలో టాక్.