రకుల్‌ప్రీత్‌ సింగ్‌ని ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు…!

-

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మరింత కష్టాల్లో పడుతోంది. ఇప్పటికే నెటిజన్లు ఒక రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్లకి మరింత స్కోప్‌ ఇచ్చింది. రకుల్ సైజ్‌ జీరో లుక్‌కి నెటిజన్ల నుంచి నెగటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ లుక్‌తో వచ్చే ఒకటి రెండు సినిమాలు కూడా రావని, ఇక రకుల్‌ లగేజ్‌ సర్దుకోవాల్సిందే అని కామెంట్‌ చేస్తున్నారు.

రాప్‌ ఛాలెంజ్‌ పోస్ట్‌ పెట్టిన రకుల్‌ప్రీత్‌ సింగ్ ఫేస్ చూసి ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. రకుల్‌ ఫేస్‌లో ఛార్మ్ తగ్గిపోయిందని,రకుల్‌ పేషెంట్‌లా తయారైందని కామెంట్లు చేస్తున్నారు. ఈ రాప్‌ ఛాలెంజ్‌ వీడియోలో పీలగా కనిపించింది రకుల్. రకుల్ ఇంకా డ్రగ్స్ కేసు నుంచి బయటపడలేదని, ఆ బాధతో పాటు NCB విచారణకి తిరిగి తిరిగి ఇలా మారిందని సెటైర్లు వేస్తున్నారు. ఈ విమర్షలు,ట్రోలింగులతో రకుల్ కెరీయర్ మరింత కష్టాల్లో పడేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version