రాజకీయ పార్టీలతో సమావేశంపై SEC ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ రోజు సమావేశానికి 11 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని, ఈ మెయిల్ ద్వారా 2 పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయని పేర్కొంది. వైసీపీ సహా సమావేశానికి 6 పార్టీలు హాజరు కాలేదని ప్రెస్ నోట్ లో పేర్కొంది. మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీతో భేటీ కానున్నట్టు కూడా పేర్కొన్నారు. అలానే వైద్య శాఖ సిబ్బందితో చర్చించలేదన్న వైసీపీ ప్రెస్‌నోట్ పై నిమ్మగడ్డ అభ్యంతరం తెలిపారు.
విస్తృతస్థాయి సంప్రదింపుల తర్వాతే సమావేశానికి ఆహ్వానించామని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ రాసిన లేఖ ఆశ్చర్యంగా ఉందని, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా.. ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని లేఖ రాయడం సరి కాదని అన్నారు. నిన్న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సింఘాల్, కాటంనేని భాస్కర్ లతో సమావేశమయి ఏపీలోని కరోనా పరిస్థితులపై చర్చించామని ఆయన అన్నారు. సీఎస్‌తో కూడా సమావేశమౌతామని అన్నారు. ఎస్‌ఈసీ ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని నిమ్మగడ్డ ఈ సందర్భంగా పేర్కొన్నారు.