న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 44 వేల 111 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,02,362 కి చేరింది. ఇందులో 2 లక్షల 96 లక్షల 5 వేల 779 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఒక్క రోజే 57 వేల 477 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4 లక్షల 95 వేల 533 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 738 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4 లక్షల 1050 మంది కరోనాతో చనిపోయారని వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు.
తాజా కరోనా బులిటెన్ ఇది!
-