దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సెకండ్ వేవ్ లో విజృంభించిన కరోనా మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 40వేలకి పైగా కేసులు వస్తున్నాయి. ఇందులో దాదాపు 50శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కేరళలో నమోదయిన కరోనా కేసులు 21,400. అలాగే కరోనా ద్వారా మరణించిన వారి సంఖ్య 160గా ఉంది. ఈ నేపథ్యంలో కేసుల పెరుగుదల చూస్తుంటే అందరికీ ఆందోళనగా ఉంది. మూడవ వేవ్ పట్ల ప్రజలు భయంగా ఉన్నారు.
ఇటు కేరళలో వచ్చిన కేసుల్లో ఒక్క మలప్పురంలోనే 3300కేసులు వచ్చాయి. ఇంకా, కోజికోడ్ లో 2534, త్రిశూర్ లో 2465, ఎర్నాకులం 2425కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడిన వారిలో 111మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి కేరళలో కరోనా విజృంభణ ఇంకా తగ్గలేదు.