ఏపీ ప్రజలకు జగన్ తీపికబురు..1.2 లక్షల మందికి కొత్త ఇండ్లు

-

వైఎస్సార్‌ కాపు నేస్త పథకం నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…టీడీపీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండని కోరారు. 2.46 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి పట్టాల విలువే రూ.12వేల కోట్లు అని వెల్లడించారు.

1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం కూడా మొదలయ్యిందని కీలక ప్రకటన చేశారు. కాపులకు ప్రతి ఏటా రూ.వేయి కోట్లు ఐదేళ్ల కాలంలో రూ.5 వేల కోట్లు పెడతానని చెప్పి, కనీసం రూ.1500 కోట్లూ ఖర్చు పెట్టని ఆ పెద్ద మనిషి పాలనలో పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన అనేక అబద్ధాలు, మోసాలు మాదిరిగానే మరొక మోసం ఇది కూడా మిగిలి పోయిందని.. మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం రూ.2వేల కోట్లు ఇస్తామన్నామన్నారు. ఐదేళ్లలో రూ.10వేల కోట్లు ఇస్తామని చెప్పామని.. ఇవాళ 3 ఏళ్లు కూడా తిరక్క ముందే రూ.32,296 కోట్ల రూపాయలు ఇవ్వగలిగామని వెల్లడించారు. మనసుతో పరిపాలన అందిస్తున్నామని వివరించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version