హైదరాబాద్ లో వర్షం తగ్గినట్టే కనపడుతుంది. వర్షాలు కాస్త తగ్గాయని భావించగా వరద ముప్పు పొంచి ఉందని లోతట్టు ప్రాంతాల వారికి అధికారులు హెచ్చరికలు పంపించారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ వాసులను ఒక కొత్త సమస్య బాగా వెంటాడుతుంది. బురద బాగా పేరుకుపోయింది. ప్రతీ ఇంట్లో కూడా బురద ఉంది. అది వాసన రావడంతో ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వీధుల్లో కూడా బురద పేరుకుంది.
పలు చోట్ల బురదను బకెట్ తో ఎత్తి పోశారు. అసలు సామాన్యులు అక్కడికి వెళ్ళలేని విధంగా ఉంది పరిస్థితి. భారీ వర్షానికి రోడ్లు అన్నీ కూడా చీద్రం అయ్యాయి. పలుచోట్ల వరద ధాటికి కంకర బయటకు వచ్చింది. వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మరికొన్ని ప్రాంతాల్లో వరద తగ్గలేదు. మురుగు నీరు ఇళ్ళల్లో నుంచి బయటకు రావడం లేదు.