ఎయిర్ లైన్స్‌లో కొత్త రూల్స్… ఇకపై అన్నిటికీ పైలట్లే అంట..!

-

విమానం అంటే చాలు ఆమ్మో విమానమా.. ఎప్పుడు ఎక్కుతామో ఏమో అని చాలామంది అనుకుంటారు. విమానం అంటే మనకు పైలెట్లు, ఎయిర్ హోస్టర్లు, విమాన సిబ్బంది గుర్తొస్తారు. కానీ ఐస్ ‌ల్యాండ్ ఎయిర్‌ కు చెందిన విమానాల్లో మాత్రం ఇకపై విమాన సిబ్బంది (క్యాబిన్ క్రూ) కనిపించరు. కరోనా వైరస్ రాకతో ఎన్నో రంగాల్లో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఐస్ ‌ల్యాండ్ ఎయిర్‌ లైన్స్ ‌లో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. విమానలలో విమాన సిబ్బంది లేకండా.. వాళ్ల పనంతా పైలట్లే చూసుకుంటారు. ఈ మేరకు ఐస్ ‌ల్యాండ్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం ప్రకటించింది. క్యాబిన్ క్రూ యూనియన్ ‌తో గత నెల ప్రారంభమైన వివాదమే ఇందుకు కారణమని సమాచారం. అయితే ఈ బాధ్యతల బదలాయింపు తాత్కాలికమేనని సంస్థ తెలిపింది. కానీ, విమానయాన రంగ నిపుణుల మాత్రం ఈ పరిణామం విషయంలో పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో విమాన సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని వారు చెబుతున్నారు. ఇది ఎంత వరకు సబబు అనే ఆలోచన కూడా ఒక వైపు వినిపిస్తుంది.

airways
airways

ప్రయాణికుల భద్రత విషయంలో క్యాబిన్ క్రూ ముఖ్య పాత్ర పోషించడమే ఇందుకు కారణం. ప్రమాద సమయంలో ప్యాసింజెర్లను వేగంగా విమానం నుంచి ఎలా దించాలి, ప్రయాణికులపై అత్యవసర సమయాల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే విషయంపై వాళ్లు శిక్షణ కూడా తీసుకుంటారు. ప్రయాణికుల భద్రత విషయంలో కానీ, వాళ్ల అవసరాలను తీర్చడంలోనూ, వాళ్లకు సహాయం చేయడంలోనూ క్యాబిన్ క్రూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అలాంటి విమాన సిబ్బంది లేకుండా అన్ని కూడా ఒక్క పైలెట్ మాత్రమే చూసుకోవాలి అంటే కొంచెం కష్టమైన పనే అని నిపుణులు అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news