Breaking : పేద ఖైదీల కోసం కేంద్ర కీలక నిర్ణయం

-

పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొస్తోంది. ఖైదీల కోసం పథకమా? అని ఆశ్చర్యపోవచ్చు. జరిమానాలు కట్టలేక, బెయిల్ ఫీజులు కట్టలేక జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీల కోసం కేంద్ర హోమ్ శాఖ కొత్త పథకాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పింది. సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని… అలాంటి వారికి ఈ పథకం ఎంతో సాయపడుతుందని తెలిపింది.

దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపింది. దీనిపై హోం మంత్రిత్వ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకంతో జైళ్లలో ఉన్న అండర్ ట్రయల్ సమస్యలను పరిష్కరించటానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version