సైబరాబాద్ కమీషనర్ రేట్ లో పబ్లిక్ సేఫ్టీ ఇంటి గ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ ను మంత్రులు కేటీఆర్, సబిత ఇంద్రా రెడ్డి, మహ్మద్ మహమూద్ అలీలు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో డీజీపీ మహేందర్ రెడ్డి, మూడు కమిషనరేట్ల సీపీలు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏకకాలంలో 5000 కెమెరాలను వీక్షించే సదుపాయం ఉంటుంది. ట్రై కమీషనర్ రేట్ పరిధిలో సేఫ్ సీటీ ప్రాజెక్టు కింద ఏర్పాటవుతున్న సిసికెమెరాల దృశ్యాల్ని ఇక్కడ నుంచి వీక్షించే సదుపాయం ఉండనుంది. రానున్న రోజుల్లో పదివేల కెమరాల ఫీడ్ ను స్క్రీన్ లో ఒకేసారి చూడవచ్చని చెబుతున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో నగరం మరింత సెక్యూర్డ్ గా మారిందని చెప్పాలి.