సీడబ్ల్యూసీ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో పోలవరం అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్…సెక్రటరీ రంగా రెడ్డి.. ఈఎన్సీ నారాయణ రెడ్డి.. ఇరిగేషన్ సెక్రటరీ ఆధిత్య నాథ్ … తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లు పాల్గొంటున్నారు. ఏపీ ఇరిగేషన్ శాఖ నుంచి ఇద్దరు అధికారులు తెలంగాణ నుంచి ఒక ప్రతినిధి హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం, పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాద్రి కి ముంపు ఉంది అని తెలంగాణ ప్రభుత్వం కొత్త వాదన మొదలు పెట్టింది.
2013 -2014 అంచనాల మేరకు 36 లక్షల క్యూసెక్ ల బ్యాక్ వాటర్ ఉంటే సుమారు 72 గ్రామాలు ముంపు గురి అయ్యే అవకాశం ఉందని, కానీ ఇప్పుడు పోలవరం నీటి నిల్వ 50 లక్షల క్యూసెక్ లకు పెంచడంతో 100కు పైగా గ్రామాలు మునిగి పోతాయని, అలానే పలు కేంద్ర ప్రభుత్వ కంపెనీలు మునిగి పోతాయని తెలంగాణ ఇరిగేషన్ పోలవరం అధారిటీకి లేఖ రాసింది. ఇక ఈ సమావేశంలో పోలవరం నిర్మాణంకు కేంద్రం ఇవ్వవలసిన నిధుల పై మరో సారి చర్చ జరగనుంది.