మీడియాకు షాక్ ఇచ్చిన ఏపీ మంత్రి…!

-

అనంతపురం జిల్లాలో మీడియాకు ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ షాక్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరించడంతో మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. జిల్లా ఇంచార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలతో మీడియాను సమావేశం హల్ నుంచి అధికారులు బయటకు పంపించారు. అయితే ఇది ఏ సమావేశం అనే దానిపై ఇప్పుడు మీడియాకు క్లారిటీ లేదు.

ప్రభుత్వ సమావేశమా… పార్టీ మీటింగా స్పష్టం చేయాలంటూ నేలపై కూర్చుని జర్నలిస్ట్ లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా సిబ్బందిని మాత్రమే కూర్చోపెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా సమీక్షా సమావేశాన్ని పార్టీ మీటింగ్ లా నిర్వహిస్తారా అంటూ జర్నలిస్ట్ లు మంత్రి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version