కర్ణాటక రాసలీలల మంత్రి కేసులో కీలక ట్విస్ట్..

-

కర్ణాటక మాజీ మంత్రి, రమేష్ జార్కిహొళి సెక్స్ సీడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి మీద ఇచ్చిన ఫిర్యాదు సామాజిక కార్యకర్త దినేష్ కుల్ల హళ్లి తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. ఇక వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుండి ఈ వీడియోలో ఉన్నది నేను కాదని ఆయన వాదిస్తూ ఉన్నాడు. తన ఫొటోను మార్ఫ్ చేశారని ఆయన వాదిస్తున్నారు.

దీంతో వీడియోలో ఉన్న యువతి అడ్రస్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. సదరు యువతి ఆర్టీ నగర్ లోని ఓ పీజీ కాలేజీలో పేయింగ్ గెస్ట్ గా ఉన్నట్టు కర్ణాటక పోలీసులు భావిస్తున్నారు. అయితే ఎవరో ఇది కావాలనే చేయించారని రమేష్ జార్కిహొళి మద్దతుదారులు చెబుతున్నారు. మరి ఇప్పుడు పోలీసు కేసు కూడా వెనక్కి తీసుకోవడంతో అసలు ఏమి జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news