కరోనా టెన్షన్.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు !

-

భారతదేశంలో కరోనా టెన్షన్ మళ్ళీ మొదలైంది. దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలను హెచ్చరించింది అని అంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, మధ్య ప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇక ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ పాస్ తప్పనిసరి చేసింది. ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారికి ఈపాస్ తప్పనిసరి చేశారు.

corona
corona

అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి నుంచి వచ్చే వారికి మాత్రమే ఈ పాస్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఇక మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు కోట్ల కరోనా డోసులు దాటాయి. 20922344 డోసుల పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 71 లక్షల మందికి తొలి డోసు, మరో 37 లక్షల మందికి రెండో డోస్ ఇచ్చినటు పేర్కొంది. 

Read more RELATED
Recommended to you

Latest news