వికారాబాద్ కాల్పుల ఘటనలో ట్విస్ట్.. ఆ క్రీడాకారిణి ఫాం హౌస్ నుండే ?

-

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. ఒక ఆవుని గన్ తో షూట్ చేసి చంపడంతో హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. ఈ ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని పోలీసులు విచారించగా ఫామ్ హౌజ్ నిర్వకులు స్థానికులను బెదిరిస్తున్నట్టు గుర్తించారు.

ఈ ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ స్థానికులను బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. కాల్పుల ఘటన పై కీలక సమాచారం సేకరించిన పోలీసులు స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు మొదలు పెట్టారు. ఆవు యజమానిని ఘటన జరిగిన మరుసటి రోజునే ఫామ్ హౌజ్ నిర్వాహకులు బెదిరించినట్టు గుర్తించారు. ఫామ్ హౌజ్ కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news