వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిరోజూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదొక విషయంలో వైసీపీని ఇరుకునే పెట్టే విధంగా రాజు గారు మాట్లాడతారు. సమయానికి తగ్గట్టుగా బాంబులు పేలుస్తూ..వైసీపీని మరింత ఇరుకున పెట్టడానికి చూస్తూ ఉంటారు. తాజాగా కూడా వైసీపీ అంతర్గత విషయాలపై ఊహించని కామెంట్ చేశారు.
పైనున్న నేత చేయిచేసుకున్న విషయం ఒకట్రెండు రోజుల్లో విషయం బయటకు వస్తుందని, అప్పుడు దాని గురించి పూర్తిగా మాట్లాడతానని బాంబ్ పేల్చారు. అయితే రఘురామ ఇలా చెప్పడంతో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా వైసీపీ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. అసలు గొడవ పడిన ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరు…వారిని కొట్టిన పైనున్న నాయకుడు ఎవరనే చర్చ నడుస్తోంది. పైగా తన నియోజకవర్గానికి దగ్గర ఉన్నవారే గొడవపడ్డారని రాజుగారు చెప్పారు. అంటే నరసాపురం స్థానానికి దగ్గర ఉన్న నేతలు.
అయితే ఆ మధ్య రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య ఆధిపత్య పోరు నడిచిన విషయం తెలిసిందే. బహిరంగంగానే వారు విమర్శలు చేసుకున్నారు. ఇక వైవీ సుబ్బారెడ్డి కలుగజేసుకుని వారి ఇష్యూ సెటిల్ చేశారు. మరి రాజు గారు వారిని ఉద్దేశించి మాట్లాడారా? లేక వేరే వారి గురించి చెప్పారా? అనేది క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావొచ్చు.