ఆ వైసీపీ నేత‌కు తీవ్ర అవ‌మానం… అప్పుడే సెగ‌లు స్టార్ట్…!

-

తోట త్రిమూర్తులు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన తూర్పుగోదావ‌రి జిల్లా నేత‌. రామ‌చంద్రాపురం నియోజ‌క వ‌ర్గంలో మంచి ప‌లుకుబ‌డి ఉండ‌డ‌మే కాకుండా త‌న‌కు, త‌న మాట‌కు తిరుగేలేని నాయ‌కుడిగా ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అలాంటి నాయ‌కుడు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓట‌మిపా ల‌య్యారు. అనంత‌రం ఆయ‌న‌కున్న బంధుత్వ ప‌రిచ‌యాల‌తో వైసీపీ బాట‌ప‌ట్టారు. అయితే, వాస్త‌వానికి ఆయ‌న‌పై ఉన్న ఎస్సీ కేసుల కార‌ణంగా నే అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గుచూపుతార‌నే పేరుంది. స‌రే ఏదేమైనా.. ఆయ‌న పార్టీ మారి వైసీపీ నాయ‌కుడిగా ఉన్నారు.

అయితే, తాజాగా ఆయ‌న‌కు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్ర‌పురంలోనే వ్య‌తిరేక‌త ఎదురైంది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పర్యటనలో బుధవారం భీమే శ్వరాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, అమలాపురం వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులుపై వైసీపీ కార్యకర్త, ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ అనుచరుడైన మేడిశెట్టి ఇజ్రాయెల్‌ చెప్పుతో దాడికి యత్నిం చాడు. వైవీ సుబ్బారెడ్డి కారులో మంత్రి మోపిదేవి, విశ్వరూప్‌తో కలసి తోట త్రిమూర్తులు వచ్చారు.

ఆలయం వద్ద త్రిమూర్తులు కారు నుంచి దిగుతుండగా కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన ఇజ్రాయెల్‌ చెప్పుతో దాడికి ప్రయత్నించాడు. గమనించిన మంత్రి మోపిదేవి.. ఇజ్రాయెల్‌ను గెంటివేశారు.
అయితే, ఈ ప‌రిణామం స్థానికంగా సంచ‌ల‌నం రేపింది. దీనికి ముందు బోసు బొమ్మ సెంట‌ర్‌లో తోట త్రి మూర్తులు అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీని కొంద‌ర‌ చించివేసి తగుల బెట్టారు. త్రిమూర్తులుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. తోట త్రిమూర్తులు వైసీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వేణు వర్గం అడ్డుకున్నట్టు చెబుతున్నారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందు కూడా వేణు, తోట ప‌ర‌స్ప‌రం వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కుదిగారు. అయితే, వేణుపై పైచేయి సాధించేందుకు తోట వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈయ‌నే రామచంద్ర‌పురం ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేపై ఆధిప‌త్య దోర‌ణి కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో తోట‌పై వేణు అక్క‌సు పెంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ్య‌తిరేక‌త ప్ర‌ద‌ర్శించారు. మ‌రి ఈ ప‌రిణామాలు ఇలానే కొన‌సాగితే.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీకి తీర‌ని న‌ష్ట‌మ‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version