2027 నుండి నూతన మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి !

-

నిన్న సాయంత్రం కేంద్ర కాబినెట్ భేటీలో కీలకమైన కొన్ని బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకుంది. అందులో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక ఈ బిల్లును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకువచ్చింది.. కాగా ఈ బిల్లును రెండు మూడు రోజుల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోద ముద్రను వేయనున్నారు. ఈ మహిళా బిల్లు మొత్తం 15 సంవత్సరాలు అమలులో ఉండేలాగా 128 రాజ్యాంగ ప్రకారణలో సవరణ చేయనున్నారు. ఈ బిల్లు ద్వారా రొటేషన్ పద్దతిలో మహిళలకు సీట్ లను కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ బిల్లు మాత్రం త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమలు చేయడానికి వీలు లేదని తెలుస్తోంది. 2027 తర్వాతనే ఈ బిల్లు అమలు లోకి వస్తుందని ప్రధాని మోదీ తెలియచేశారు. ఇక ఈ బిల్లుపై ఇప్పటికే కొన్ని పార్టీలు అనిశ్చితితో ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్ లేదు అంటూ సమాజ్వాదీ మరియు RJD పార్టీలు బిల్లుపై తమ వ్యతిరేకతను చూపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version