పుష్ప 2 నుంచి న్యూ ఇయర్ పోస్టర్ రిలీజ్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రస్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

ఇక పుష్ప 2 చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేశారు. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. ఈ ఏడాది పుష్ప దే రూల్ అంటూ పోస్ట్ చేశారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ఈ ఏడాది పుష్పరాజ్ రానున్నారు. ఈ ఏడాది మీ ఆశయాలు, కోరికలు నెరవేరాలి. హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఆగస్టు 15న  విడుదల కానున్న పుష్ప 2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version