దేశంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు, గంజాయి వినియోగం పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారీ అవుతున్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. ీ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టులు, ఓడరేవు లను కస్టమ్స్ అధికారులు, నార్కొటిక్ బ్యూరో జల్లెడ పడుతున్నారు.
అన్నింటిని తరవుగా చెక్ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా చెన్నై పట్టణ పరిధిలోని మాధవరంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా..కారులో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు పెడ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 కోట్ల విలువైన 16 కిలోల నిషేధిత ఉత్ప్రేరకాలను సీజ్ చేశారు.అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.