మన్మోహన్ సింగ్ అంతియయాత్ర సరిగ్గా జరుగలేదని వస్తున్న వార్తలపై పీవీ ఫ్యామిలీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మన్మోహన్ సింగ్ అంతియయాత్రను సరిగ్గా నిర్వహించలేదని.బీజేపీని విమర్శిస్తున్న కాంగ్రెస్సోళ్లు ఓసారి 20 ఏళ్ల క్రితం వెనక్కు తిరిగి చూసుకోవాలని… ఢిల్లీలో పీవీ నరసింహరావుకి కనీసం రెండు గజాల స్థలం కూడా ఇవ్వలేదని ఆగ్రహించారు.
ఆయన మృతదేహాన్ని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో అనుమతించలేదని మండిపడ్డారు. పీవీ నరసింహరావు అంతిమయాత్ర కోసం సోనియా గాంధీ హైదరాబాద్‌కు రాలేదన్నారు. ఆయన గౌరవార్థం.. ఒక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదని తెలిపారు పీవీ నరసింహరావు సోదరుడు పీవీ మనోహర్ రావు. అదే మన్మోహన్ అంతిమయాత్రకు మాత్రం.. మొత్తం కేబినెట్ వచ్చిందన్నారు.