చర్లపల్లి రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఈదురు గాలులకు నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ ఈదురు గాలులకు కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ పైకప్పు కు కట్టిన హోర్డింగ్ విరిగి కింద పడిపోయింది. మూడు నెలల కిందట రైల్వే స్టేషన్ ను వీడియో కాల్స్ ద్వారా అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది.

అయితే చిన్నపాటి ఈదురు గాలులకు… రైల్వే స్టేషన్ లో ఉన్న భాగాలన్నీ కొట్టుకుపోయి కిందపడడం… తాజాగా చోటుచేసుకుంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ హోర్డింగ్ కింద పడిన సమయంలో… ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే అత్యంత ప్రమాదమైన సంఘటన జరిగేది. కాగా హైదరాబాదులో నిన్న చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడిన సంగతి తెలిసిందే.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఈదురుగాలులకు ధ్వంసమైన నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్
మూడు నెలల కింద రైల్వే స్టేషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోడీ
చిన్నపాటి ఈదురు గాలులకు కొట్టుకుపోయిన రైల్వే స్టేషన్ pic.twitter.com/qc0fq7XUWM
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2025