ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో చేపట్టిన ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతోంది. ఇక ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న సమ్మె నేటికి 10వ రోజుకు చేరుకుంది. డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు నివాళి అర్పించేందుకు ఉదయం నుంచే డిపోల దగ్గరకు కార్మికులు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఏరియాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
కొత్తగూడెం బస్ డిపో ఎదురుగా కార్మికులు వినూత్న రీతిలో యోగా చేసి నిరసన తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, పలు సంఘాల నేతలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యోగులు, రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్ కు మద్ధతు తెలుపుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని. వారి డిమాండ్లను నెరవేర్చాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి.