పగ తీర్చుకున్న న్యూజిలాండ్, టీం ఇండియా పరువు పోయింది…!

-

భారత న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీం ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సునాయాసయంగా చేధించింది. దీనితో టి20 సీరీస్ లో ఎదురైన ఘోర పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఎక్కడా కూడా తడబడకుండా న్యూజిలాండ్ కొండంత లక్ష్యాన్ని కూడా సులువుగా చేధించింది.

ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ, లోకేష్ రాహుల్ సెంచరీలతో జట్టుని ఆదుకున్నారు. దీనితో ఆ మాత్రం స్కోర్ అయినా సాధించింది టీం ఇండియా. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీం ఇండియా ఎక్కడా కూడా స్వేచ్చగా షాట్లు ఆడలేదు.

న్యూజిలాండ్ జట్టుకి ఓపెనర్లు గుప్తిల్, నికోలస్ మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్ కు సెంచరి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కెప్టెన్ విలియ౦సన్, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఫెయిల్ అయినా సరే కీపర్ లాథం, జిమ్మీ నీశం, గ్రాండ్ హోం రాణించడంతో కివీస్ సునాయాస విజయం సాధించింది. కివీస్ బ్యాట్స్మెన్ లో ఓపెనర్ నికోలస్ 80 పరుగులు, గుప్తిల్ 66 పరుగులు, గ్రాండ్ హోం 58 పరుగులు చేసారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version