పీఎఫ్ఐ కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు

-

పీఎఫ్ఐ కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 100 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై దర్యాప్తు షురూ చేసిన ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు.

యూపీ, కేరళ సహా పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐకి చెందిన వ్యక్తుల నివాసాల్లో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఏపీ, తెలంగాణ సోదాలు నిర్వహించారు. నిజామాబాద్, నెల్లూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని హైదరాబాద్ లో ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఇవాళ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 100 మంది పీఎఫ్‌ఐ ముఖ్యులను అరెస్ట్ చేసింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారని, ఉగ్ర సంస్థల్లో చేరేలా యువతను ప్రోత్సహిస్తున్నారని, పీఎఫ్‌ఐ, విద్యార్థి విభాగానికి నిధులు సమకూర్చిన అంశానికి సంబంధించి సంబంధించి 40 ప్రాంతాల్లో ఎన్ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version