బెంగళూరు అల్లర్ల పై ఎన్ ఐ ఏ కేసు నమోదు చేసింది. గత నెలలో సోషల్ మీడియా పోస్ట్ కారణంగా బెంగళూరులో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిని 1000 మంది యువకులు ముట్టడించి దాడి చేశారు. ప్రొఫెట్ మొహమ్మద్ కు వ్యతిరేకంగా ఆగస్ట్ 11 న ఫేస్ బుక్ లో ఎం ఎల్ ఏ బంధువు అయిన నవీన్ పోస్ట్ పెట్టారు. డి జే హలి, కే జి హకి పీ ఎస్ ల పైనా యువకులు దాడులకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తుల తో పాటు ప్రైవేట్ ఆస్తులను అల్లరి మూకలు ధ్వంసం చేశారు.
దీంతో ఈ కేసుల మీద ఎన్ఐఎ ఐ జీ ర్యాంక్ అధికారితో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక బెంగళూరులో అల్లర్లకు పాల్పడిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో మొదట ఇద్దరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పులకేశినగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేసి, తగులబెట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు అసలు కారకుడైన నవీన్ అనే వ్యక్తిని కేజీ హళ్లి పోలీసులు అరెస్టు చేశారు.