దేశవ్యాప్తంగా NIA సోదాలు.. ఏకంగా 22 ప్రాంతాల్లో!

-

దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయని ఇంటెల్ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు చేపడుతోంది. మొత్తం 22 ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉగ్ర దాడులు, ఉగ్ర సంస్థలకు ఫండింగ్ సమకూర్చిన కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఐఏ మహారాష్ట్రలో నలుగురిని అదుపులోకి తీసుకుంది. గతనెల 20న పంజాబ్‌లోని 13 ప్రాంతాల్లోనూ ఎన్ఐఏ సోదాలు జరిపింది.సెప్టెంబర్ 24న తమిళనాడులో సోదాలు జరిపి తాంబరం,పుదుక్కొట్టై,కన్యాకుమారిల్లో ఆకస్మిక తనిఖీలు జరిపింది.

ఇక ఉగ్రవాదులకు ఫండింగ్ చేసిన కేసులో ఇప్పటికే లోక్‌సభ ఎంపీ ఇంజనీర్ రషీద్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రషీద్ గత నెల 10న మధ్యంతర బెయిల్ పొందగా.. దాని గడువు అక్టోబర్ 2తో ముగిసింది. 2017లో టెర్రర్ ఫండింగ్ కేసులో రషీద్ అరెస్టు అవ్వగా..2019లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అటు కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌లపై ఛార్జిషీట్ దాఖలు చేయగా..మాలిక్ నేరాన్ని అంగీకరించగా.. 2022లో ట్రయల్ కోర్టు అతనికి జీవితఖైదు విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news