కొడంగల్‌కు సీఎం రేవంత్‌‌ రెడ్డి.. ఎందుకంటే?

-

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో శనివారం పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.ముందుగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు.

cm revanth reddy cabinet over paddy

ఆ తర్వాత కొడంగల్‌లో ఫిజియోథెరపీ, వైద్య, నర్సింగ్, కళాశాలల పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో కోస్గి చేరుకుని పోలీస్‌స్టేషన్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల స్టాళ్లను సందర్శించి వారితో కాసేపు ముచ్చటిస్తారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చే క్రమంలో కొంగర కలాన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తారు.అనంతరం ఫాక్స్‌కాన్‌ కంపెనీ చేపడుతున్న పనులను పరిశీలించి, ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news