రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నిహారిక.. ఇదిగో ప్రూఫ్..

-

మెగా డాటర్ నిహారిక కొణిదెల గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి.. వ్యక్తిగత జీవితం లో బ్రేకప్ గురించి నిరంతరం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే ఈ విషయంపై మాత్రం ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాలుగా ఫోటోషూట్లు షేర్ చేస్తూనే ఉంది నిహారిక.. దీన్ని బట్టి చూస్తే ఈ అమ్మడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని హింట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పోలిస్తే నిహారిక ఫోటోషూట్లతో గ్లామర్ వలకబోస్తోందని చెప్పవచ్చు.

తాజాగా నిహారిక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇందులో ఈమె ఉదా రంగు చీర కట్టులో మెస్మరైజ్ చేస్తూ సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా కనిపిస్తోంది.. లూస్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా నిలబడుతూ మెగా ప్రిన్సెస్ అనేలా కనిపిస్తోంది. సాయం సంధ్య సమయం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అందమైన ఫోటో ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తోంది నిహారిక.. ఈ ఫోటో అభిమానులకు ఎక్కడో గుచ్చుకునేలా కనిపిస్తోంది.

వివాహానికి ముందు నిహారిక హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో వివాహమైన తర్వాత నిర్మాతగా రాణించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. మొదట బుల్లితెర హోస్టుగా వ్యవహరించిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరొకసారి మునపటిలాగా యాక్టింగ్ కోసం రీయంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివాహమైన తర్వాత నటనకు దూరంగా ఉన్న నిహారిక రీ ఎంట్రీ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక ఫోటోలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version