ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా(కొవిడ్-19) వైరస్ పై ప్రజలకు అవగాహన ఉందా? అసలు కరోనా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరికివారు కరోనా విషయంలో ఎలా జాగ్రత్తలు పాటించాలి? వంటి అనేక విషయాలు మనకు ఇప్పుడు ఎవరు చెబుతారు? ఎవరి వద్దకు వెళ్లాలి? అంతా కొత్తే.. మరి ఈ సమయంలో మనకు సాయం చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు? అనేది పరిశీలిస్తే.. నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్(ఎన్ ఐ హెచ్ డబ్ల్యూ ఎన్) ఆధ్వర్యంలో `సంజీవన్` అనే హెల్త్ టెక్ ఏఐ ఇంజన్ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది.
కరోనా వైరస్ ప్రపంచానికి సవాలుగా మారిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 769 కోట్లమందికి, భారత దేశంలో 130+ కోట్ల మందికి సేవలు అందించేందుకు సంజీవన్ ముందుకు వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్నిముందుగా ప్రశ్నల రూపంలో అంచనా వేసుకుని, దాని తర్వాత వారికి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు సూచించడం, అవసరమైన వైద్య సదుపాయం కూడా రిఫర్ చేయడం ఈ సంజీవన్ లక్ష్యం. అదే సమయంలో కొవిడ్-19పై ప్రజలను అప్రమత్తం చేయడం కూడా ప్రధాన కర్తవ్యం.
దీనికి గాను ప్రజలు చేయాల్సిన పని చాలా సింపుల్. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి https://tinyurl.com/NIHWN google లేదా Apple Appstore tinyurl.com/NIHWNapple లను డౌన్ లోడ్ చేసుకోవడమే!. వీటిని డౌన్‌లోడ్ చేసుకోగానే మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను, కొన్ని ప్రశ్నలకు సమాధానాలను చెప్పడం ద్వారా మీరు కరోనాకు సంబంధించిన పూర్తి నివేదికను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు, మీకు అవసరమైన… వైద్య సాయం కూడా ఈ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. కరోనా ఆపత్కాలంలో ఎవరినీ సంప్రదించే సమయం లేకపోవడం, ఉన్నా అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో ఇలాంటి యాప్ లభించడం నిజంగా చాలా అదృష్టమనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. వీటిని ఫాలో అవడం ద్వారా కరోనా విషయంలో మనం విజ్ఞానాన్ని పెంచుకోవడంతోపాటు, మన బంధువుల, స్నేహితుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారం అవుతాం. అంతేకాదు, ఏవైనా సందేహాలు ఉన్నవారు 9100 181 181 కు కాల్ చేయొచ్చు. అదేవిధంగా care@nihwn.co కు ఈమెయిల్ ద్వారా సందేహాలకు సమాధానాలు , ఆరోగ్య జాగ్రత్తలు తెలుసుకోవచ్చు.