ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ తరుణంలో నిమ్మగడ్డ… మంత్రిపై తీవ్ర చర్యలు తీసుకున్నారు. తాజాగా మంత్రి మరోమారు ఎన్నికల కమీషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాసేపటి క్రితం మాట్లాడారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకు కట్టుబడి ఉంటాను అని అన్నారు. వ్యతిరేకంగా మాట్లాడను అని, నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి ఇది చేస్తున్నారు అని ఆరోపించారు. నిన్నటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని ఆయన స్పష్టం చేసారు. ఎన్నికల అధికారి చట్టబద్దంగా వ్యవహరించకుంటే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము అని ఆయన ఆయన వార్నింగ్ ఇచ్చారు.
పంచాయతీ మంత్రి అయిన నాతో మాట్లాడాలి, కానీ చంద్రబాబు తో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది చేస్తున్నాడు అని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనను, ఆ అవసరం నాకు లేదు అని ఆయన అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తాము, అక్రమాలకు పాల్పడను, ఆయన నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని వెల్లడించారు. ఏకగ్రీవం అయితే పంచాయతీకి నిధులు వస్తాయి అని… గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఏకగ్రీవాలపై సమీక్ష ఎందుకు అని నిలదీశారు. చంద్రబాబు వద్ద నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారు అని మండిపడ్డారు. ఏకగ్రీవాలపై ఆయన సమీక్ష ఏంటి అని ప్రశ్నించారు.