రేవంత్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ కులం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యం మాట్లాడటం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నల్గొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తమ్ రెడ్డి గెలుపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. సీఎం స్థాయిలో ఉండి ప్రధాని కులం పై మాట్లాడటం పై మండిపడ్డారు. గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1994లోనే మోడీ కులాన్ని బీసీలలో చేర్చారని గుర్తుకు చేసారు. అటు మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తొక్కి పెట్టిందని.. బీజేపీ  అదికారంలోకి వచ్చాకే  అమలు పరిచిందని తెలిపారు.

దాదాపు 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి 2024 డిసెంబర్ లోపు 2లక్షల ఉద్యోగాల భర్తీని ప్రకటించి అందుకు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు జరగడం లేదని.. అమలు చేసే శక్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version