రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి పై ఈసీ నిమ్మగడ్డ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. నా ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడు ఎదుటివారిని చంపే హక్కు రాజ్యాంగం తనకు కల్పించిందన్న వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేసారు. తనను ఉద్దేశించి వెంకట్రామిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్న ఎస్ఈసీ వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని లేఖలో అభిప్రాయ పడ్డారు.
దీంతో వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీని ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన వెంకట్రామిరెడ్డి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని.. దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్ పూర్తయ్యాక ఎన్నికల్లో పాల్గొంటామని కోరినా ఎస్ఈసీ వినలేదన్న ఆయన ద్దాలు చాటున మాట్లాడిన ఎస్ఈసీకి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.. మేం జాగ్రత్త పడకూడదా..? అని ప్రశ్నించారు.